బిరియానితో కార్తీకి లక్ తిరిగివచ్చేనా?

బిరియానితో కార్తీకి లక్ తిరిగివచ్చేనా?

Published on Dec 20, 2013 8:00 AM IST

karthi

తమిళ హీరో కార్తీ ‘బిరియాని’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బిరియాని సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంత కాలంగా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు లేని కార్తీ బిరియానితో అందుకుంటానని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన సినిమా కామెడీగా సాగే యాక్షన్ థ్రిల్లర్ లా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్తీ ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుందని చెప్పాడు. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాలో కార్తీ సరసన హన్సిక హీరోయిన్ గా కనిపించనుంది. యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందించాడు.

కార్తీ ఈ సినిమాతో తన లక్ ని తిరిగి పొందేనా? ఈ విషయాన్ని మరికొద్ది గంటల్లో తెలియజేస్తాం.

తాజా వార్తలు