సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న అజ్మీర్ మసీద్ ని సదర్శించి పూజలు జరిపాడు. ఈ రోజు మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ మూవీ సినిమా ఆడియో విడుదల కానుంది. గతంలో మహేష్ బాబు దూకుడు, బిజినెస్ మేన్ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఇదే దర్గాని దర్శించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఫిలిం స్టార్స్ ఈ దర్గాని విజిట్ చేయడం, సినిమా విజయం గురించి ప్రార్ధించడం ఆనవాయితీగా మారింది.
ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో జరగనున్న ‘1-నేనొక్కడినే’ ఆడియోకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శిల్పకళావేదికలో జరుగుతున్న ఈ వేడుక లైవ్ ప్రసారాన్ని ఒక్క టీవీలలోనే కాకుండా థియేటర్స్ లో కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే ఒక్కో థియేటర్ లో 1 కాంటెస్ట్ లో గెలిచిన ఒక్కో విజేత చేత ఈ సినిమాలోని ఒక్కో పాటని విడుదల చేయించనున్నారు.
మహేష్ బాబు, కృతి సనన్ జంటగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. నిన్ననే మహేష్ బాబు సుకుమార్ పనితనం గురించి బాగా మెచ్చుకున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు.