క్రైమ్ థ్రిల్లర్ తో రానున్న మేర్లపాక గాంధీ

క్రైమ్ థ్రిల్లర్ తో రానున్న మేర్లపాక గాంధీ

Published on Dec 19, 2013 4:00 PM IST

Merlapaka-Gandhi
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా రాకముందు వరకూ మేర్లపాక గాంధీ అనే పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా అతని పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపించడం మొదలైంది. అలాగే అతనికి నిర్మాతల నుండి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మేర్లపాక గాంధీ తన రాబోయే సినిమా గురించి చెప్పాడు. ‘ నా మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత నా సెకండ్ సినిమాని క్రైమ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఈ మూవీలో కూడా జర్నీ ఎపిసోడ్ ఉంటుంది. ఆ సినిమాలో కూడా కావలసినంత కామెడీ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. జంధ్యాల గారిలా క్లీన్ మూవీస్ తియ్యాలన్నదే నా లక్ష్యం. ఆయన సినిమా ల్లానే మెసేజ్, కామెడీ కలిసి ఉండేలా సినిమా ప్లాన్ చేసుకుంటానని’ అన్నాడు.

సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాని జెమిని కిరణ్ నిర్మించాడు.

తాజా వార్తలు