‘బిర్యానీ’ అంటే దక్షిణాది ప్రజలకు పిచ్చి. దాని రుచి ఎవరూ అంతా త్వరగా మరిచిపోలేరనేమో కార్తీ, వెంకట్ ప్రభులు తమ సినిమాకు ఈ నోరూరించే వంటకం పేరు పెట్టారు. ఈ సినిమా ఈ నెల 20న విడుదలకానుంది. సినిమా విజయంపై కార్తీ చాలా నమ్మకంగా వున్నాడు
ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకుడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఆంధ్రా లో కార్తీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తమిళ, తెలుగు భాషలలొ ఒకేసారి విడుదల చేస్తున్నారు. హన్సిక ఈ సినిమాలో హీరోయిన్. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది