జాన్ డే మూవీకి ఉన్న తెలుగు కనెక్షన్

జాన్ డే మూవీకి ఉన్న తెలుగు కనెక్షన్

Published on Sep 7, 2013 3:30 PM IST

Johnday
ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి బాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. మేము చెపుతున్నది ‘జాన్ డే’ సినిమా ద్వారా పరిచయమవుతున్న ఆహిశోర్ సోల్మోన్ గురించి, సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న ఈ మూవీలో నజీరుద్దీన్ షా, రందీప్ హుడ ప్రధాన పాత్రలు పోషించారు. అన్జుం రిజ్వి, ఎ ఖాన్, కె ఆసిఫ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కె తారీ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

కర్నూల్ లో పుట్టిన ఆహిశోర్ హైదరాబాద్ లో పెరిగాడు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా జాన్ డే సినిమాని తీసాడు. పది సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అతను ఎట్టకేలకు మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ అయ్యాడు. అతని మొదటి సినిమా విఅజయమ్ కావాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం..

తాజా వార్తలు