ఆస్కార్ ప్రదర్శనకు ఆదిశంకర

ఆస్కార్ ప్రదర్శనకు ఆదిశంకర

Published on Aug 30, 2013 9:01 AM IST

Adishankara

‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘పాండురంగడు’ సినిమాలకు రచయితగా పనిచేసిన జెకె భారవి దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్రయత్నం ‘జగద్గురు ఆదిశంకర’. ఈ సినిమాలో కౌశిక్ ప్రధాన పాత్రలో నటించగా చిరంజీవి సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే నాగార్జున, మోహన్ బాబు, సాయి కుమార్, సుమన్, రోజా, మీనా, శ్రీ హరి లాంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకి మంచి స్పందన వస్తుండడంతో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో సాయి కుమార్ మాట్లాడుతూ ‘ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం, నాగార్జున లాంటి వారు ఈ సినిమాలో నటించడంతో సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. అన్నిటికంటే మించి ఏపీ నిర్మాతల మండలి ఈ సినిమాని ఆస్కార్ స్క్రీనింగ్ కి సిఫారసు చేయడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు. ఈ చిత్ర నిర్మాత జయశ్రీ దేవి ఈ సినిమాని యువత అందరూ కచ్చితంగా చూడాలి అనే ఉద్దేశంతో ఈ శుక్రవారం నుండి ఒక వారం రోజుల పాటు ఐడి కార్డు చూపిస్తే సగం ధరకే టికెట్ ఇస్తారని, అందరూ వెళ్లి సినిమా చూడాల్సిందిగా కోరారు.

తాజా వార్తలు