నిర్మాతలను భయపడుతున్న రూపాయి

నిర్మాతలను భయపడుతున్న రూపాయి

Published on Aug 29, 2013 6:32 PM IST

TFI

ఇండియన్ రూపాయి విలువ ఒక్కసారిగా బాగా పడిపోవడంతో చాలా మంది భయపడుతున్నారు. అలా భయపడే వారి లిస్టులో తెలుగు సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు. రూపాయి విలువ పడిపోయే కొద్దీ ఓవర్సీస్ షెడ్యూల్స్ ఉన్న నిర్మాతల సినిమాల ప్రొడక్షన్ ఖర్చు అమాంతం పెరిగిపోతుంది.

భారీ బడ్జెట్ సినిమాల్లో రెండు మూడు పాటలను యూరప్, బ్యాంకాక్, ఆస్ట్రేలియా మొదలైన అందమైన లోకేషన్స్ లో షూట్ చేస్తారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోవడం వల్ల ఇలాంటి లోకేషన్స్ లో షూటింగ్ చెయ్యాలంటే బాగా ఖర్చవుతుంది.

అయినప్పటికీ కొంతమంది నిర్మాతలు, దర్శకులు ఈ విషయంలో పెద్దగా ఆవేదన చెందడం లేదు. ‘ రూపాయి విలువ ఇంత పడిపోయినప్పటికీ ఇంకా బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లు చేయడం చీప్ గానే లభిస్తోందని’ ఓ బడా నిర్మాత దగ్గర పనిచేసే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు.

తాజా వార్తలు