ఖరారైన ఆటోనగర్ సూర్య చివరి షెడ్యూల్ డేట్

ఖరారైన ఆటోనగర్ సూర్య చివరి షెడ్యూల్ డేట్

Published on Aug 29, 2013 3:32 PM IST

autonagar-surya
అక్కినేని నాగ చైతన్య – సమంత జంటగా నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ రిలీజ్ విషయం ఇంకా ప్రేక్షకులతో దోబూచులాడుతోంది. దేవా కట్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితం దేవా కట్టా ఈ సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం ఇచ్చాడు. మేము విన్న వార్తల ప్రకారం ఈ మూవీ మళ్ళీ సెప్టెంబర్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది, ఇంకా కొద్ది రోజులు షూటింగ్ చేస్తే మొత్తం పూర్తవుతుంది.

ఈ సినిమాని ముందుగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు ప్రారంభించారు. కానీ వాళ్ళు ఈ సినిమాని ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల ఆపేశారు. కానీ తాజాగా ఈ సినిమాని నాగార్జున తీసుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు. దేవకట్టా చివరిగా తీసిన ‘ప్రస్థానం’ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ‘ఆటోనగర్ సూర్య’లో నాగ చైతన్య మెకానిక్ గా కనిపించనున్నాడు.

తాజా వార్తలు