అప్పుడే పెళ్ళా అంటున్న చార్మీ.!

అప్పుడే పెళ్ళా అంటున్న చార్మీ.!

Published on Aug 29, 2013 8:58 AM IST

charmi

అందాలా భామ చార్మీ చాలా చిన్నతనంలోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. కెరీర్ మొదట్లో కుర్రకారు మనసు దోచుకొని ఫుల్ క్రేజ్ తెచ్చుకొని వరుసగా సినిమాలు చేసిన ఈ భామకి విజయాల కంటే ఫ్లాపులే ఎక్కువగా పలకరించాయి. దాంతో చార్మీ ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తోంది. కెరీర్ లో చెప్పుకోతగ్గ అవకాశాలు లేని చార్మీని పెళ్ళెప్పుడు అని అడిగితే ‘ నా వయసు 25 సంవత్సరాలే కదా.. కెరీర్ మీద దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం. మనకు 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టలేము. కానీ అదే వయసులో పెళ్లి చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను నా కెరీర్ పై దృష్టి పెడుతున్నానని’ చార్మీ సమాధానం ఇచ్చింది.

చార్మీ చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే చార్మీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే సూచనలు కనిపించడం లేదు. చార్మీ వేశ్య పాత్రలో నటించిన ‘ప్రేమ ఒక మైకం’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు