బంతిని ఎంత బలంతో నేలకు కొడితే అంతే బలంతో తిరిగి పైకి లేగుస్తుంది. ఈ సూక్తి నయనతారకు ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. పరాజయాల బాట పడుతున్న ప్రతీసారి తను తిరిగి విజయపరంపరను కొనసాగిస్తుంది. ముందుగా ‘శ్రీ రామరాజ్యం’ ఆమె ఆఖరి చిత్రం అని తెలిపారు. తరువాత సినిమా రంగం నుండి వైదొలుగుతుంది అని కూడా అన్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ నయన్ ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘ గ్రీకువీరుడు’ సినిమాలలో నటించింది. ఈమెకు ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. ఈ భామ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘అనామిక’ సినిమాలోనే కాక బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ సరసన కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలూ తమిళ్ అయ్యే అవకాశాలు వున్నాయి. ఈ సినిమాలేకాక ఆమె నటించిన మరో నాలుగు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగావున్నాయి.
దాదాపు తెలుగులో అగ్రహీరోలతో నటించిన నయన్ జయం రవి,ఆర్య మరియు ఉధయనిధి స్టాలిన్ వంటి యువకులతో సైతం నటించింది. అటు పెద్దవారితో, ఇటు యువ హీరోలతో సమానంగా నటిస్తున్న ఈ అమ్మడి కెరీర్ కు ఇప్పట్లో ఢొకా లేదనే చెప్పాలి