వేగంగా జరుగుతున్న బాహుబలి షూటింగ్

వేగంగా జరుగుతున్న బాహుబలి షూటింగ్

Published on Aug 28, 2013 7:29 PM IST

Bahubali
టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘బాహుబలి’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తిన్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రభాస్ కి బ్రదర్ గా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా కనిపించనుంది.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాన్నీ ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అధికారిక పేజిలో పోస్ట్ చేసింది ‘ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదటి సెట్ పూర్తయ్యింది. షూటింగ్ జరుగుతోంది. ఈ రోజు సినిమాలోని మరో ముఖ్యమైన సన్నివేశాన్ని షూట్ చేస్తున్నామని’ వారు పోస్ట్ చేసారు.

ఆర్కా మీడియా బానేర్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాని ఒక్క తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు