ఒక ఫ్యామిలీ హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత యాక్షన్ హీరోగా మారిన సుమన్ ఇప్పుడు మైథలాజికల్ పాత్రలు చేయడానికి, కొన్ని నెగటివ్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఈ రోజు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన 100వ చిత్రానికి సంబందించిన విశేషాలను తెలియజేశాడు. ‘ నేను ఇప్పటి వరకూ నేను 350 సినిమాలు చేసాను. అందులో 99 సినిమాల్లో హీరోగా చేసాను. త్వరలోనే నేను హీరోగా 100వ సినిమా చేయనున్నాను. ఈ సినిమాకి నేనే దర్శకత్వం వహిస్తాను. నేను దర్శకత్వం వహించిన నా 100వ సినిమా గుర్తుండి పోవాలి. అందుకే ఈ సినిమా ద్వారా ఎలాంటి సందేశాలు ఇవ్వకుండా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాని కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించనున్నాడని’ తెలిపాడు.
అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షాకదరణ పొందిన సుమన్ తనే హీరోగా డైరెక్ట్ చేయనున్న సినిమాతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.