యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సంవత్సరం ‘మిర్చి’ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రభార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా కన్నడలో రీమేక్ కానుంది. ‘ఈగ’ ఫేం సుదీప్ ఈ రిమేక్ లో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో సత్యరాజ్ చేసిన పాత్రలో కన్నడ టాప్ హీరో రవిచంద్రన్ కనిపించనున్నారని సమాచారం. మిగిలిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.
మిర్చి సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క – రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్ గా నటించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీని రీమేక్ చేస్తున్న సందర్భంగా సుధీప్ కి గుడ్ లక్ చెబుతున్నాం..