మళ్ళీ దక్షిణాదికి ఆసిన్..?

మళ్ళీ దక్షిణాదికి ఆసిన్..?

Published on Nov 2, 2011 11:13 AM IST

asin

హాట్ కేరళ బ్యూటీ ఆసిన్ గత నాలుగేళ్ళుగా ముంబై కి మకాం మార్చింది. అమీర్ ఖాన్ హీరో గా నటించిన ‘గజని’ సినిమా సూపర్ హిట్ కావడమే ఇందుకు కారణం. ఈ విజయం తో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఈ అమ్మడు భావించింది. అయితే ఆ అసలాన్నే అడియాసలయ్యాయి. ఈ నాలుగేళ్లలో ఆమెకు కేవలం మూడు సినిమాల్లో నటించే అవకాశం మాత్రమే లభించింది. రెండు చిత్రాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

తాజాగా ఆసిన్ మళ్ళీ దక్షినాదిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే కొన్ని భారీ చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు యాసిన్ సన్నిహిత వర్గాల సమాచారం. సూపర్ స్టార్ రజనికాంత్ తో నటించాలన్నది తన డ్రీమ్ అని ఈ అమ్మడు ఇప్పటికే ప్రకటించింది. అల్ ఇండియా సూపర్ స్టార్ సరసన ఆసిన్ స్థానం సంపాదించాలని మనమూ కోరుకుందాం.

వేచి చూడాలి.. తన రెండో ఇన్నింగ్స్ లో యాసిన్ ఏ సంచలనాలు సృష్టించబోతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు