Raja Saab : రాజాసాబ్ స్పీడు పెంచాల్సిందే..!

Raja Saab : రాజాసాబ్ స్పీడు పెంచాల్సిందే..!

Published on Dec 9, 2025 7:05 AM IST

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రంతో రెబల్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 2026 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

అయితే, పండుగ బరిలో పలు సినిమాలు పోటీ పడుతుండటంతో రాజాసాబ్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయాల్సి ఉంది. ఇప్పటికి కేవలం కంటెంట్ రూపంలో మాత్రమే మూవీ యూనిట్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపై హీరో ప్రభాస్ సహా మిగతా క్యాస్ట్ కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.

దీంతో రాజాసాబ్ ఇక నేరుగా రంగంలోకి దిగి సినిమాను ప్రమోట్ చేస్తే, మిగతా చిత్రాలతో పోటీని తట్టుకునే అవకాశం ఉంటుందని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు