1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర – ఆడియో రూపంలోకి విక్రమ్ పూల పుస్తకం

1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర – ఆడియో రూపంలోకి విక్రమ్ పూల పుస్తకం

Published on Dec 8, 2025 8:00 AM IST

1984 NTR Democracy

1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకం ఇప్పుడు ఆడియో రూపంలోకి వస్తోంది. విక్రమ్ పూల రచించిన ఈ పుస్తకం ఆడియో టీజర్‌ను ఎన్టీఆర్ తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ గారు లాంచ్ చేశారు. ఈ పుస్తకాన్ని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో అందిస్తున్నారు.

​ఈ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ మాట్లాడుతూ, 1984 ఆగస్టులో గుండె ఆపరేషన్ తర్వాత తిరిగొచ్చిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను కేంద్ర పాలకులు కుట్రపన్ని పదవీచ్యుతుణ్ని చేసినప్పుడు, ఆయన ప్రజల మద్దతుతో, కాంగ్రెసేతర వ్యక్తుల సహకారంతో పోరాడి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి చరిత్రను తిరగరాశారని గుర్తుచేశారు.

​చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని చేరవేయవచ్చని టిడి జనార్దన్ పేర్కొన్నారు. ఈ పుస్తకం సెప్టెంబర్ 6న విజయవాడలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విడుదలై అపూర్వ ఆదరణ పొందింది.

​ఆడియో పుస్తకాన్ని డిసెంబర్ 13, 2025న హైదరాబాద్‌లో ఎన్టీఆర్ తనయ, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురందరేశ్వరి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తక పర్యవేక్షకులు సినీ నటుడు అశోక్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు