Dhurandhar: ‘ధురంధర్’ ని మించి నా సినిమా.. యంగ్ హీరో కాన్ఫిడెన్స్

Dhurandhar: ‘ధురంధర్’ ని మించి నా సినిమా.. యంగ్ హీరో కాన్ఫిడెన్స్

Published on Dec 8, 2025 9:00 PM IST

dhurandhar-and-swayambhu

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాని షేక్ చేస్తున్న లేటెస్ట్ చిత్రమే “ధురంధర్”. మూడున్నర గంటలు రన్ టైం తో వచ్చినప్పటికీ ఇండియన్ ఆడియెన్స్ ని కూర్చోపెట్టి మంచి రన్ ని అందుకుంది. ఇలా ఆల్రెడీ 160 కోట్లకి పైగా గ్రాస్ ని మూడు రోజుల్లో అందుకున్న ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ కోసం కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ పై మన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

పాన్ ఇండియా ఆడియెన్స్ వస్తున్నాం..

కార్తికేయ 2 తో నార్త్ ఆడియెన్స్ లో కూడా మంచి ముద్ర వేసుకున్నాడు యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్. లేటెస్ట్ గా ధురంధర్ టీంకి కంగ్రాట్స్ చెప్పి తన భారీ సినిమా ‘స్వయంభు’ ఇంతకు మించి ఉంటుంది, పాన్ ఇండియా ఆడియెన్స్ వస్తున్నాం అని అంటున్నాడు.

నిఖిల్ గట్ స్టేట్మెంట్ లో కాన్ఫిడెన్స్

బాలీవుడ్ ని షేక్ చేస్తున్న సినిమాని మించి తన సినిమా ఉంటుంది అని ఓ యంగ్ హీరో ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. అయినప్పటికీ ఇచ్చాడు అంటే తమ ప్రాజెక్ట్ విషయంలో తాను ఎంత నమ్మకంగా ఉన్నాడో అనేది అర్ధం చేసుకోవాలి. ఈ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు