
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ సెన్సేషన్ సినిమానే వారణాసి. జస్ట్ కాన్సెప్ట్ ట్రైలర్ తోనే ప్రపంచాన్ని తిరిగి చూసేలా అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం జక్కన్న కీలక సన్నివేశాలు గత కొన్ని రోజుల నుంచి తెరకెక్కిస్తున్నారట.
సమాచారం ప్రకారం మహేష్ బాబుకి చెందిన చిన్ననాటి సన్నివేశాలు ఇందులో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పుడు టాక్. సో మొత్తానికి వారణాసి చిత్రాన్ని జక్కన్న మంచి ప్యాకెడ్ గా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే 2027 వేసవి కానుకగా విడుదల ప్లాన్ చేస్తున్నారు.

