ఫోటో మూమెంట్: పవర్ఫుల్ సీఎంతో ‘అఖండ’ టీం

ఫోటో మూమెంట్: పవర్ఫుల్ సీఎంతో ‘అఖండ’ టీం

Published on Nov 24, 2025 12:00 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ 2 తాండవం”. దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేస్తున్న ఈ అవైటెడ్ డివోషనల్ యాక్షన్ చిత్రం ఆల్రెడీ ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మేకర్స్ ఇండియా లోనే మోస్ట్ పవర్ఫుల్ సీఎం ని కలవడం జరిగింది. మరి అది ఎవరో కాదు అందరికీ తెలిసిన సీఎం యోగి ఆదిత్యానాథ్.

ఉత్తర ప్రదేశ్ సీఎం ని ఇపుడు అఖండ టీం, బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను అలానే హీరోయిన్ సంయుక్త సహా నిర్మాతలు కూడా కలిశారు. కలిసి తనకి అఖండ త్రిసులన్నీ బహూకరించి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారట. దీనితో ఈ పిక్స్ సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారాయి. మొత్తానికి మాత్రం చిత్ర యూనిట్ నార్త్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు