యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ మేక హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఛాంపియన్”. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడిగా వచ్చి మంచి మార్క్ ని సెట్ చేసుకున్న రోషన్ తన గత సినిమాకి దీనికి ఎక్కవ గ్యాప్ తీసుకున్నప్పటికీ సినిమాపై మంచి ఉంది. ఇందుకు కారణం నిర్మాణ సంస్థ అయితే ఫైనల్ గా మేకర్స్ సినిమా అప్డేట్స్ ని వరుసగా అందిస్తున్నారు.
ఇక హీరోయిన్ పై ఓ బ్యూటిఫుల్ ఇంట్రో వీడియోని ఫస్ట్ సింగిల్ ప్రోమోగా రివీల్ చేసిన సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఈ నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల ముందు నుంచి వరుస ప్రమోషన్స్ స్టార్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. అలాగే స్వప్న దత్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ 25న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


