SSMB29 మెగా ఈవెంట్‌కు ‘ఢిల్లీ’ ఎఫెక్ట్..?

SSMB29 మెగా ఈవెంట్‌కు ‘ఢిల్లీ’ ఎఫెక్ట్..?

Published on Nov 13, 2025 2:00 AM IST

SSMB29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా ‘గ్లోబ్‌ట్రాటర్‌’ ప్రమోషన్లు వేగంగా సాగుతున్నాయి. నవంబర్‌ 15న రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ కోసం భారీ ఈవెంట్ నిర్వహించేందుకు టీమ్‌ సిద్ధమవుతోంది. అభిమానుల్లో ఇప్పటికే భారీ ఉత్సాహం నెలకొంది. ఈ ఈవెంట్‌ కోసం ప్రత్యేక సెట్‌ కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ కారణంగా పెద్ద పబ్లిక్‌ ఈవెంట్లకు అనుమతులపై అధికారులు పునఃపరిశీలన చేస్తున్నారు. భారీ జన సమూహాలు చేరే కార్యక్రమాల పై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అందువల్ల ‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్‌ కూడా అధికారుల పరిశీలనలో ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈవెంట్‌ ఏర్పాట్లు యథావిధిగా సాగుతున్నాయి. అయితే భద్రతా పరిస్థితుల దృష్ట్యా అనుమతులు మారే అవకాశం ఉంది. ఈవెంట్‌ జరగడానికి అనుమతి లభిస్తే కఠిన భద్రతా చర్యలు అమలు చేయనున్నారు. పోలీసులు, నిర్వాహకులు ట్రాఫిక్‌ మరియు జనసంచార నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ ఈవెంట్‌కు ఏదైనా భద్రతా పరమైన అడ్డంకులు వస్తాయేమో చూడాలి.

తాజా వార్తలు