రాజమౌళి ఓకే.. నెక్స్ట్ ఎవరు..?

రాజమౌళి ఓకే.. నెక్స్ట్ ఎవరు..?

Published on Nov 13, 2025 1:00 AM IST

టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. నవంబర్‌ 15న ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ రానుంది. ఈ ప్రాజెక్ట్‌ మహేష్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. అభిమానులు ఇప్పటికే ఈ చిత్రం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ సినిమా తర్వాత మహేష్‌ ఏ ప్రాజెక్ట్‌ చేస్తారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రాజమౌళి లాంటి లెజెండరీ దర్శకుడితో సినిమా చేశాక, రొటీన్ కమర్షియల్ సినిమాలకు మహేష్ బాబు దూరంగా ఉంటాడు. సో, ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేయాలి.

ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా పేరు ముందుకు వస్తోంది. గతంలో మహేష్‌తో ఆయన సినిమా దాదాపు ఫైనల్‌ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సందీప్‌, పెద్ద స్టార్‌ ప్రాజెక్ట్‌లను హ్యాండిల్‌ చేయడంలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో మహేష్‌ తన తర్వాత చిత్రాన్ని సందీప్‌తో చేయాలని అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది.

తాజా వార్తలు