టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘జటాధర’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించగా సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఈ చిత్రానికి తొలి వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా 4.62 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఈ వారంలో పెరిగే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేయగా శివిన్ నారంగ్, ప్రేర్ణ అరోరా, ఉమేష్ భన్సాల్, ఉజ్వల్ ఆనంద్, అరుణ అగర్వాల్, రాజీవ్ అగర్వాల్, నిఖిల్ నంద ప్రొడ్యూస్ చేశారు.


