పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “ఓజి”. పవన్ అభిమానుల అంచనాలకి తగ్గట్టుగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలో అదరగొడుతుంది. ఇలా ప్రస్తుతం డైలీ డోసేజ్ ఓజి హవా కొనసాగుతూ ఉండగా ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో స్పెషల్ షోస్ కి సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.
మొన్నామధ్య ఓటిటి రిలీజ్ కి ముందు పవన్ అభిమానులు కొన్ని థియేటర్స్ లో స్పెషల్ షోస్ ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇలానే ఓజి 50వ రోజు సందర్భంగా ఈ నవంబర్ 13న తెలుగు స్టేట్స్ లో స్పెషల్ షోస్ కొన్ని పడనున్నాయట. దీనితో ఓజి ఫ్యాన్స్ కి మాత్రం మరోసారి థియేటర్స్ లో సాలిడ్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.


