టాక్.. ‘పెద్ది’ నుంచి నెక్స్ట్ సాంగ్ ఇదేనా?

టాక్.. ‘పెద్ది’ నుంచి నెక్స్ట్ సాంగ్ ఇదేనా?

Published on Nov 9, 2025 9:00 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా ఏ ఆర్ రెహమాన్ ఇంకా జగపతి బాబు సహా, శివ రాజ్ కుమార్, దివ్యెందు శర్మ లతో చేస్తున్న సాలిడ్ చిత్రమే “పెద్ది”. భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ ఇప్పుడు సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.

ఈసారి మేకర్స్ సాలిడ్ మాస్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ లో మస్సా మస్సా లిరిక్ మంచి ఫేమస్ అయ్యింది. మరి ఈ సాంగ్ నే నెక్స్ట్ సాంగ్ గా మేకర్స్ విడుదల చేసే ఛాన్స్ ఉందట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అంతా చికిరి చికిరి తోనే వైబ్ అవుతున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు