టర్నింగ్ పాయింట్‌కు చేరువలో శ్రీలీల..?

టర్నింగ్ పాయింట్‌కు చేరువలో శ్రీలీల..?

Published on Nov 6, 2025 2:24 AM IST

Sreeleela

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన యంగ్ బ్యూటీ శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చినా వాటిని పూర్తి విజయాలుగా మార్చుకోలేకపోయింది. ఆమె చేసిన ‘ధమాకా’ తర్వాత విజయాలు దాదాపు దూరమయ్యాయి. రొటీన్ పాత్రలు, డ్యాన్సులకే ఆమె పరిమితమైపోయిందన్న విమర్శలు ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ‘పరాశక్తి’ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దు’ వంటి హిట్ సినిమాలు చేసిన సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఆమె చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలు కాస్త వైవిధ్యంగా ఉంటాయి. ఇందులో శ్రీలీల పాత్రలో కూడా అదే వైవిధ్యం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమా విజయవంతమైతే శ్రీలీల కెరీర్‌లో మలుపు తిరిగే అవకాశం ఉంది. సుధా కొంగర సృష్టించే బలమైన పాత్ర ఆమెకు కొత్త ఇమేజ్‌ని తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

తాజా వార్తలు