తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన ‘జైలర్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ బొమ్మగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలోనూ పలు కేమియా పాత్రలు ఉంటాయని.. అందులో టాలీవుడ్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ కూడా ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడనే టాక్ కోలీవుడ్ సర్కిల్స్‌లో కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది. దీంతో బాలయ్య ‘జైలర్ 2’లో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కానీ, ఇప్పుడు రజినీ ఫ్యాన్స్‌తో పాటు ‘జైలర్ 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బాలయ్య ఓ సాలిడ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘జైలర్ 2’లో కేమియో పాత్ర చేసేందుకు బాలయ్య నో చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. అసలు బాలయ్య ‘జైలర్ 2’ లాంటి సినిమాలో కేమియో రోల్ ఎందుకు రిజెక్ట్ చేశాడా అంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి బాలయ్య రిజెక్ట్ చేసిన పాత్రలో ఎవరు నటిస్తారనేది వేచి చూడాలి.


