అఫీషియల్ : రజినీకాంత్‌తో కమల్ హాసన్ మూవీ కన్ఫర్మ్..!

అఫీషియల్ : రజినీకాంత్‌తో కమల్ హాసన్ మూవీ కన్ఫర్మ్..!

Published on Nov 5, 2025 7:53 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’లో నటిస్తున్న రజినీ, త్వరలో మరో సెన్సేషనల్ కాంబినేషన్‌కు ఓకే చెప్పారు. కూలీ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, క్రమంగా ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.

కానీ, ఈ కాంబో ఖచ్చితంగా ఉండబోతుందని అఫీషియల్‌గా ప్రకటించారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ఆయన సొంత ప్రొడక్షన్ హౌజ్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజినీకాంత్ తన కెరీర్‌లోని 173వ చిత్రాన్ని చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు. ఈ బ్యానర్ స్థాపించి 44 ఏళ్లు కావడంతో ఇలాంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని రూపొందించేందుకు తాము సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని 2027 పొంగల్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు