మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అయితే, ‘వార్-2’ కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ కేటాయించడంతో ఈ మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే, ‘వార్-2’ రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా మిగలడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన ఫోకస్ మొత్తం నీల్ మూవీపైకి షిఫ్ట్ చేశాడు.
ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ఔట్‌పుట్ సరిగా రావడం లేదని.. దీంతో తీసిన ఫుటేజీ మొత్తాన్ని రీ-షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో రూమర్స్ వినిపించాయి. కానీ, అందులో వాస్తవం లేదని.. కొంతవరకు రీ-షూట్ చేసిన మాట వాస్తవమే అయినా, పూర్తిగా రీషూట్ చేయలేదని చిత్ర వర్గాల టాక్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లో జాయిన్ అయ్యాడని.. ఇకపై సినిమా షూటింగ్‌కు ఎలాంటి బ్రేక్ లేకుండా తారక్ ప్లాన్ చేస్తున్నాడట.
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


