పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, సినిమా సెలెబ్రిటీలు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభాస్ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం నుంచి రాబోతున్న సాలిడ్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్పై పలు వార్తలు వినిపించగా, ‘ఫౌజీ’ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ను పెడతారా.. ఈ సినిమా ఫస్ట్ లుక్లో ప్రభాస్ ఎలా కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి రాబోతున్న అప్డేట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.