సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ లేనట్టేనా..?

సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ లేనట్టేనా..?

Published on Oct 23, 2025 9:00 AM IST

Siddu-Jonnalagadda

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల రిలీజై బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. నీరజా కోన తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత సిద్ధు తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే, సిద్ధు జొన్నలగడ్డ గతంలో అనౌన్స్ చేసిన ప్రెస్టీజియస్ చిత్రం ‘కోహినూర్’ ఇప్పుడు పట్టాలెక్కడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. సిద్ధు ప్రస్తుత ట్రాక్ కారణంగా ఈ చిత్రానికి భారీ బడ్జెట్‌ను కేటాయించడం.. రెండు భాగాలుగా రూపొందించడం కష్టంగా మారుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో ఈ సినిమాను పక్కకు పెట్టాలని వారు నిర్ణయించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను రవికాంత్ డైరెక్ట్ చేయాల్సి ఉండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక సిద్ధు తన నెక్స్ట్ చిత్రాలైన బ్యాడాస్, టిల్లు క్యూబ్ లపై ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు.

తాజా వార్తలు