‘మాస్ జాతర’తో ప్రేక్షకులు స్టన్ అవుతారు – నాగవంశీ

‘మాస్ జాతర’తో ప్రేక్షకులు స్టన్ అవుతారు – నాగవంశీ

Published on Oct 22, 2025 9:30 PM IST

Mass-Jathara

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలో హీరో రవితేజతో కలిసి నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో నాగవంశీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాస్ జాతర సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని.. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమా చూసి ప్రేక్షకులు స్టన్ అవుతారని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

రవితేజను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో, ఈ సినిమాలో అలాగే కనిపిస్తారని ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం నాగవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు