దీపావళి శుభ సందర్భంగా మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలో ‘సిష్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్’ ఘనంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
నటులు అలీ, బ్రహ్మానందం, శివాజీ, రఘుబాబు, కమెడియన్ ప్రవీణ్, జైల్ సూపరిండెంట్ దామర్ల కాళిదాసు, హీరోయిన్లు ఎస్తర్, దివి, ఇన్ఫ్లూయెన్సర్ బెజవాడ బేబక్క (మధు), మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, హీరో అభిషేక్ బొడ్డేపల్లి, దర్శకుడు సాయి వానపల్లి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అలీ, స్కూల్ చైర్మన్ లోహిత్‌తో పాటు ఎస్తర్, బెజవాడ బేబక్కలు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రీ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటులు అలీ మాట్లాడుతూ, “ఈ స్కూల్‌ను చూస్తుంటే మళ్లీ చిన్నప్పటిలా స్కూల్‌కి వెళ్లాలనిపిస్తుంది. నాకు చదువంటే ఎంతో గౌరవం, అందుకే ఆరు భాషలు నేర్చుకున్నా,” అన్నారు.
బ్రహ్మానందం గారు మాట్లాడుతూ, “మణికొండ లాంటి ఏరియాలో ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేసిన లోహిత్‌ను అభినందిస్తున్నా. చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తే వారి జీవితానికి అది పునాది అవుతుంది,” అని తెలిపారు.
శివాజి మాట్లాడుతూ, “నేను డిగ్రీ వరకు చదివాను, ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండేది అనిపించింది. అందుకే నా పిల్లలకు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అని చెప్పాను. పిల్లల కోసం ఈ స్కూల్ పెట్టిన లోహిత్‌కి నా అభినందనలు,” అన్నారు.
‘సిష్ట్లా స్కూల్’ ఫౌండర్ చైర్మన్ లోహిత్ మాట్లాడుతూ, ఇంతమంది ప్రముఖులు వచ్చి తమ స్కూల్‌ను ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, అందరి అభిమానంతో ఇలాంటి స్కూల్స్‌ను మరో 50 వరకు విస్తరిస్తామని ప్రకటించారు.



