క్లాసిక్ నవల ఆధారంగా ‘జుగారి క్రాస్’.. షురూ అయిన కొత్త ప్రాజెక్ట్

క్లాసిక్ నవల ఆధారంగా ‘జుగారి క్రాస్’.. షురూ అయిన కొత్త ప్రాజెక్ట్

Published on Oct 17, 2025 7:00 PM IST

Raj B. Shetty and Gurudatta Ganiga

ఒకప్పుడు క్లాసిక్ నవలలను సినిమాలుగా మలచడం అనేది తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో బాగా కనిపించేది. మళ్లీ ఇప్పుడు అలాంటి ధోరణి కనిపిస్తోంది. కన్నడ సాహిత్యంలో ప్రముఖ స్థానం ఉన్న రచయిత పూర్ణచంద్ర తేజస్వి రాసిన ప్రసిద్ధ నవల ‘జుగారి క్రాస్’ ఆధారంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ మొదలైంది.
ఈ చిత్రాన్ని ‘కరావళి’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు గురుదత్త గనిగ టేకప్ చేశారు. అంతకంటే ముఖ్యంగా, ‘కరావళి’లో హీరోగా నటిస్తున్న రాజ్ బి. శెట్టి ఈ కొత్త చిత్రంలో కూడా గురుదత్తతో చేతులు కలపడం హాట్ టాపిక్‌గా మారింది. ‘కరావళి’ టైటిల్, టీజర్ ఇప్పటికే ఆసక్తిని రేపగా, ఆ సినిమా విడుదల కాకముందే ఈ దర్శకుడు, నటుడు కలిసి మరో శక్తివంతమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

‘జుగారి క్రాస్’ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన టైటిల్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. అద్భుతమైన విజువల్స్, వెన్నులో వణుకు పుట్టించే స్థాయిలోని నేపథ్య సంగీతం (BGM) ఈ ప్రోమోకి హైలైట్‌గా నిలిచాయి. స్క్రీన్‌పై కనిపించిన పుర్రెలు, ఉగ్రరూపం దాల్చిన యాక్షన్ అంశాలు, మారణాయుధాలు చూస్తుంటే.. ఇది కేవలం నవల ఆధారిత చిత్రమే కాదు, భారీ స్థాయి యాక్షన్ డ్రామాగా రాబోతుందని అర్థమవుతోంది.

‘కరావళి’ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం గురుదత్త గనిగ ఆ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే, ‘జుగారి క్రాస్’ ప్రీ-ప్రొడక్షన్‌కి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని గురుదత్త తన సొంత బ్యానర్‌ ‘గురుదత్త గనిగ ఫిల్మ్స్’ పై నిర్మిస్తుండటం విశేషం. ‘కరావళి’ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అభిమన్యు సదానందన్, సంగీత దర్శకుడు సచిన్ బస్రూర్ ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు