సమీక్ష : ‘తెలుసు కదా’ – కొంతమేర మెప్పించే ట్రైయాంగిల్ రోమ్ కామ్

సమీక్ష : ‘తెలుసు కదా’ – కొంతమేర మెప్పించే ట్రైయాంగిల్ రోమ్ కామ్

Published on Oct 17, 2025 6:05 PM IST

విడుదల తేదీ : అక్టోబర్ 17, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సిద్ధూ జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు తదితరులు
దర్శకత్వం : నీరజ కోన
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
సంగీత దర్శకుడు :  థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్ : జ్ఞానశేఖర్ వి ఎస్
ఎడిటర్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ దీపావళి కానుకగా థియేటర్స్ లో ట్రీట్ ఇచ్చేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతూ చేసిన చిత్రం “తెలుసు కదా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన చిన్ననాటి నుంచే అనాథగా పెరిగిన వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా నిజాయితీగా ఉంటాడు, అలానే తనకంటూ ఒక కుటుంబం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు. ఇలా ఆల్రెడీ ఒకమ్మాయిని ప్రేమించి బ్రేకప్ అయ్యాక తన లైఫ్ లోకి అంజలి శర్మ (రాశిఖన్నా) వస్తుంది. అలా తమ పరిచయం పెళ్లివరకు వెళుతుంది కానీ వారిలో ఒకరు వల్ల పిల్లలు పుట్టరని తెలుస్తోంది. ఈ సమయంలో తమ లైఫ్ లోకి ఎంటర్ అయ్యిన ఓ డాక్టర్ రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) తమకు సాయం చేస్తానని చెప్తుంది. మరి ఇక్కడ నుంచి వీరి జర్నీ ఎలా సాగింది? ఈ రాగ ఎవరు? ఆమె ఎందుకు వరుణ్, అంజలి లైఫ్ లోకి వచ్చింది? వరుణ్ కోరుకున్న కుటుంబం దక్కిందా లేదా? అంజలి ఎందుకు వరుణ్ నుంచి విడిపోవాలి అనుకుంటుంది? మళ్లీ వీరిద్దరూ కలుస్తారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ సిద్ధూ జొన్నలగడ్డ చేసిన వరుణ్ రోల్ అని చెప్పవచ్చు. దర్శకురాలు తన రోల్ ని డిజైన్ చేసుకొని తెరకెక్కించిన తీరు సినిమాలో ఇంప్రెస్ చేసే విధానంగా కొనసాగుతుంది. ఫస్టాఫ్ లో తన డైలాగ్స్ కానీ కొన్ని యూత్ ఫుల్ సన్నివేశాలు కానీ ఆకట్టుకుంటాయి.

అంతేకాకుండా ఈ రోల్ లో సిద్ధూ చాలా బాగా చేసాడు. తన మార్క్ యటిట్యూడ్ ని ప్రదర్శిస్తూ అవసరమైన ఎమోషనల్ సీన్స్ లో చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ని తను అందించాడు. ఇక తనతో పాటుగా హీరోయిన్స్ రాశిఖన్నా శ్రీనిధి శెట్టి లు తమ పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

రాశిఖన్నా తన రోల్ లో బాగా సూట్ అయ్యింది. గ్లామర్ లుక్స్, సిద్ధూతో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. అలాగే శ్రీనిధి శెట్టి కూడా తన రోల్ లో డీసెంట్ పెర్ఫార్మన్స్ ని చేసింది. అలాగే సినిమాలో ఈ ముగ్గురు నడుమ జరిగే డ్రామా కొన్ని సీన్స్ మాత్రం యువతిని బాగా ఆకట్టుకునే చాన్స్ ఉంది. ఇక వీరితో పాటుగా కమెడియన్ వైవా హర్ష రోల్ సినిమాలో బాగుంది. హీరోతోనే సాగే ఓ మంచి ఫ్రెండ్ గా కీలక సన్నివేశాల్లో కనువిప్పు కలిగించడం ఇంకా బెటర్ గా అంటే వీరి నడుమ ఫన్ సీన్స్ మెప్పిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో కోర్ లైన్ ఒక మూమెంట్ లో ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది కానీ ఇది మరీ అంత కొత్తదేమి కాదు బాగా సినిమాలు చూసేవారికి అయితే ఇంకా ఫ్లాట్ గా ఇది అనిపించవచ్చు. ఈ ప్రాసెస్ లో కథనం వీలైనంత తేలికగా ఉండాలి కానీ ఇందులో నడిచే కథనం ఒకింత కన్ఫ్యూజ్డ్ గా అనిపించే అవకాశం ఉంది.

సిద్ధూ రోల్ క్లారిటీగానే అనిపిస్తుంది కానీ తన చుట్టూతా అల్లుకున్న కథనం ఇతర పాత్రలతో సన్నివేశాలుతో కామన్ ఆడియెన్స్ ఇమడాలి అంటే కొంచెం సమయం పట్టేలా అనిపిస్తుంది. సో ఇది అందరకీ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం. అలాగే కొంతమేర సినిమా బాగుంది అనుకునే మూమెంట్స్ లోనే మరికొంత సేపటికే రెగ్యులర్ గానే అనిపిస్తుంది.

ఇలా పూర్తి స్థాయిలో కథనం అంతంత మాత్రం గానే అనిపిస్తుంది. అలాగే ఒక సిద్ధూ రోల్ బాగానే ఉంది క్లారిటీ గానే వెళుతుంది కదా అనిపిస్తుంది. కానీ ఇదే ఐడియాలజీ ఒకవేళ రాశిఖన్నాకి కూడా ఉండి ఉంటే? ఇలాంటి క్లారిటీలు మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కథనం ఇది వరకు చూసిన కొన్ని భార్యాభర్తల సినిమాలని కూడా తలపిస్తుంది. కాకపోతే ఇది కొంచెం ట్రెండీ వెర్షన్ అనుకోవాలి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. మేకర్స్ చేసుకున్న సెటప్ అంతా బాగుంది. థమన్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా స్కోర్ అయితే సినిమాని ఎలివేట్ చేసింది. ఇంకా కెమెరా వర్క్, ఎడిటింగ్ లు డీసెంట్ గా ఉన్నాయి. డైలాగ్ పోర్షన్ కూడా బాగుంది.

ఇక దర్శకురాలు నీరజ కోన విషయానికి వస్తే.. డెబ్యూ దర్శకురాలిగా తన వర్క్ బాగానే ఉందని చెప్పొచ్చు కానీ అదే సమయంలో ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపించేలా ఉంది. మెయిన్ ప్లాట్ అలాగే హీరో రోల్ ని ఆమె డిజైన్ చేసుకొని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. కానీ ఈ క్రమంలో నడిచిన కథనం మాత్రం సోసోగానే అనిపించింది. వీటితో తన వర్క్ అలా ఓకే రేంజ్ లోనే అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “తెలుసు కదా” చిత్రం యువత వరకు అక్కడక్కడా ఓకే అనిపించే రెగ్యులర్ రోమ్ కామ్ డ్రామా అనుకోవచ్చు. సిద్ధూ రోల్ వరకు యువత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మిగతా ప్రాసెస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. సో ఈ సినిమా ఈ దీపావళి వీకెండ్ లో కొన్ని మూమెంట్స్ వరకు ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు