హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జెయిన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్ర ప్రస్తావనలో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ అభిమాని కిరణ్ అబ్బవరం ఓజీ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఎలా అనిపించింది.. అంటూ ప్రశ్నించాడు. దీనికి కిరణ్ అబ్బవరం సమాధానమిస్తూ..
“ఇప్పుడు ‘ఓజీ’ గురించి మాట్లాడదలచుకోలేదు. ఒక లాజిక్ చెబుతాను.. నేను పవన్ కళ్యాణ్ గారికి నిజమైన అభిమానిని. కానీ ఆయన గురించి తరచూ మాట్లాడితే, అది ఇతరులకు తప్పుడు సందేశం ఇవ్వొచ్చు,” అని చెప్పారు.
“నన్ను గమనించే న్యూట్రల్ ప్రేక్షకులు, ‘తన సినిమా రిలీజ్‌కి దగ్గరగా వస్తుండటంతో పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటున్నాడేమో’ అని అనుకోవచ్చు. అలాగే, ‘ఆయన గురించి మాట్లాడితే టికెట్లు ఎక్కువ అమ్ముడవుతాయని భావిస్తున్నాడేమో’ అని కూడా ఫీలవచ్చు. నాకు అది ఇష్టం లేదు. నా సొంత గుర్తింపును నేను కష్టపడి సంపాదించాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చిత్రంపై కామెంట్ చేయనుంటూనే కిరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.