పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “ఓజి”. క్రేజీ విజన్ తో ప్లాన్ చేసిన ఈ మల్టీ సినిమా ఫ్రాంచైజ్ కి ఆరంభంగా వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులని ఎంతో ఎగ్జైట్ చేసింది. ఇలా థియేటర్స్ లో సాలిడ్ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది.
దీనితో ఓజి సినిమా కోసం చూస్తున్న ఓటిటి వీక్షకులకు ఆ గుడ్ న్యూస్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఓజి చిత్రం ఈ అక్టోబర్ 23 నుంచే ఓటిటిలో సందడి చేయనుంది అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఆరోజు నుంచి రానుంది అని టాక్. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.