ఓటీటీ : కొత్త కాన్సెప్ట్ తో ఆనంద్‌ దేవరకొండ ‘తక్షకుడు’ !

ఓటీటీ : కొత్త కాన్సెప్ట్ తో ఆనంద్‌ దేవరకొండ ‘తక్షకుడు’ !

Published on Oct 13, 2025 3:14 PM IST

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓటీటీ ట్రెండ్‌ను ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.

ఆనంద్‌ దేవరకొండ ఓ యాక్షన్‌ ఫిల్మ్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఆనంద్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘తక్షకుడు’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా విడుదల కాబోతుంది. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు..’ అంటూ తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేసింది. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

తాజా వార్తలు