అభిషేక్ బచ్చన్ తాజాగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. తన విజయం వెనక తన భార్య ఐశ్వర్యారాయ్ ఉందంటూ కామెంట్స్ చేయడం విశేషం. నిజానికి ఈ జంట ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ ఇలా మాట్లాడటం ఆకట్టుకుంది. ఇంతకీ అభిషేక్ ఏం మాట్లాడాడు అంటే.. ఆయన మాటల్లోనే విందాం.
అభిషేక్ మాట్లాడుతూ.. ‘ఇది నాకెంతో ప్రత్యేకం. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయింది. నా జర్నీ అనుకున్నంత సులభంగా ఏం సాగలేదు. ఎన్నో కష్టాలు దాటుకొని ఈ స్థాయికి వచ్చాను. నాకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలందరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా పురస్కారం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇది నా కల. ఈ సందర్భంగా నా భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. ఈ అవార్డు గెలుచుకోవడానికి ఐశ్వర్య ప్రధాన కారణం. ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఈ పురస్కారమే అందుకు నిదర్శనం’ అని అభిషేక్ తెలిపారు.