‘జన నాయకుడు’ నిర్ణయంతో ‘రాజా సాబ్’కు లైన్ క్లియర్..?

‘జన నాయకుడు’ నిర్ణయంతో ‘రాజా సాబ్’కు లైన్ క్లియర్..?

Published on Oct 9, 2025 1:00 AM IST

The Raja Saab -Jana Nayagan

సంక్రాంతి పండుగ సీజన్‌లో తమ సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అందరు హీరోలు ప్రయత్నిస్తుంటారు. ఇక 2026 సంక్రాంతి బరిలో పలువురు తెలుగు, తమిళ హీరోలు తమ చిత్రాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. టాలీవుడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హార్రర్ కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. అయితే, తమిళ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయకుడు’ కూడా జనవరి 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘రాజా సాబ్’ చిత్రానికి కష్టాలు తప్పేలా లేవు అని అందరూ అనుకున్నారు.

అయితే, రీసెంట్‌గా తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన పొలిటిక్ మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి 40 మంది మృతిచెందారు. ఈ ఘటనతో విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ కారణంగా జనవరిలో తన సినిమాను రిలీజ్ చేసేందుకు విజయ్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడట. ఒకవేళ విజయ్ తన ‘జన నాయకుడు’ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంటే, ఇక రాజా సాబ్‌కు లైన్ క్లియర్ అయినట్లే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభాస్‌ను అడ్డుకునే వారు ఉండరు. మరి నిజంగానే విజయ్ ప్రభాస్‌కు లైన్ క్లియర్ చేస్తాడా లేడా అనేది చూడాలి.

తాజా వార్తలు