పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం ఫ్యాన్స్ ని మెప్పించింది. అయితే పవన్ కళ్యాణ్ కి ఒక్క సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో చూపించే విధంగా ఓజి పెర్ఫామ్ చేసింది అని చెప్పవచ్చు. దీనితో ఫ్యాన్స్ లో ఓజి ఇంపాక్ట్ కూడా గట్టిగానే పడింది.
మరి ఇదే సిరీస్ లో ఇంకో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ నుంచి ఓజి లాంటి మరో సినిమానే ఓ టాప్ ప్రొడ్యూసర్ పవన్ తో ప్లాన్ చేయాలని చూస్తున్నట్టుగా ఇపుడు టాక్ వినిపిస్తుంది. పవన్ డేట్స్ ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. మరి దిల్ రాజు ఇపుడు పవన్ తో ఒక ఓజి లాంటి స్టైల్ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎవరితో ఎప్పుడు ఉంటుంది అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.