‘మిత్రమండలి’ పై ఫ్యామిలీ ఆడియెన్స్ కి ప్రామిస్ చేస్తున్న ప్రియదర్శి!

‘మిత్రమండలి’ పై ఫ్యామిలీ ఆడియెన్స్ కి ప్రామిస్ చేస్తున్న ప్రియదర్శి!

Published on Oct 4, 2025 12:30 AM IST

ఈ రానున్న కొన్ని రోజుల్లో మన టాలీవుడ్ నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ తో అలరించేందుకు వస్తున్న చిత్రాల్లో “మిత్రమండలి” కూడా ఒకటి. యువ హీరో ప్రియదర్శి అలాగే రాగ్ మయూర్ అలాగే విష్ణు ఓయ్ ఇంకా ప్రసాద్ బెహరా లాంటి టాలెంటెడ్ నటుల కలయికలో దర్శకుడు విజయేందర్ ఎస్ తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ కంటెంట్ తో రాబోతుంది.

మరి ఈ సినిమా తాలూకా నటీనటులు విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ లో పాల్గొనగా అక్కడ నుంచి ప్రియదర్శి ఫ్యామిలీ ఆడియెన్స్ కి తన ప్రామిస్ చేస్తున్నాడు. మిత్రమండలి ఒక క్లీన్ ఎంటర్టైనర్ అని ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో అలరిస్తుంది అని తాను కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇక ఈ ఈవెంట్ లో హీరోయిన్ నిహారిక ఎన్ ఎమ్ ఇంకా ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించగా బన్నీ వాసు సమర్పణలో ఈ చిత్రం ఈ అక్టోబర్ 16న విడుదలకి రాబోతుంది.

తాజా వార్తలు