నీల్ సినిమాకి ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. ‘కాంతార’ ఈవెంట్లో డైనమిక్ ప్రెజెన్స్ తో

నీల్ సినిమాకి ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. ‘కాంతార’ ఈవెంట్లో డైనమిక్ ప్రెజెన్స్ తో

Published on Sep 28, 2025 11:07 PM IST

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ కొంతమేర పూర్తయింది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ కూడా ఈ మధ్య తన ఫిట్నెస్ లెవెల్స్ చూపించి క్రేజీ సర్ప్రైజ్ అందించాడు.

అయితే తారక్ లేటెస్ట్ గా కాంతార తెలుగు గ్రాండ్ ఈవెంట్ ని చేశారు. మరి ఈ సినిమా ఈవెంట్ లో తారక్ డైనమిక్ లుక్స్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి. లీన్ బాడీతో తారక్ కొత్త గడ్డం లుక్ లో దర్శనం ఇచ్చాడు. దీనితో ప్రశాంత్ నీల్ సినిమాకి తారక్ లుక్ పై మరింత క్లారిటీ ఫ్యాన్స్ కి వచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి నిర్మాణం వహిస్తున్న హోంబళే ఫిల్మ్స్ వారు కాంతార 1 ని కూడా నిర్మాణం వహించగా ఈ అక్టోబర్ 2న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు