ప్రస్తుతం ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రమే “అవతార్ 3”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించగా ఊహించని హైప్ దీనిపై నెలకొంది. ఇక ఇది వరకే వచ్చిన మొదటి ట్రైలర్ తోనే కేమెరూన్ మరోసారి ఇది ఖచ్చితంగా బిగ్ స్క్రీన్స్ పై మాత్రమే చూడాల్సిన సినిమానే అని ప్రూవ్ చేశారు.
మరి అప్పుడే భారీ హైప్ సెట్ అయితే లేటెస్ట్ గా వదిలిన ట్రైలర్ తో ఇవి ఇంకా ఎక్కువ అయ్యిపోయాయి అని చెప్పాలి. భారీ విజువల్స్ అండ్ సాలిడ్ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కనిపిస్తున్న ఈ ట్రైలర్ చూసి పాన్ ఇండియా ఆడియెన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ డిసెంబర్ 19న చిత్రం భారీ లెవెల్లో వరల్డ్ వైడ్ గా సహా పాన్ ఇండియా లెవెల్లో కూడా విడుదల కాబోతుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి