ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కథ-కథనం-దర్శకత్వం ఎం.నాగ రాజశేఖర్ రెడ్డి అందిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇటీవల మంచు మనోజ్ చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ సింగిల్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ‘ఓ.. చెలియా’ టీజర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “టీజర్ చాలా బాగుంది. యంగ్ టీమ్ అద్భుతంగా పనిచేసినట్టు కనిపిస్తోంది. దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అన్నారు.
ఇక ఈ టీజర్‌ను చూస్తే ప్రేమకథలో హారర్, యాక్షన్ ఎలిమెంట్స్ మిళితమై ఉత్కంఠగా సాగనుందని స్పష్టమవుతోంది. దెయ్యాల కాన్సెప్ట్ ఈ కథలో ఎలా చూపెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.