‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం వెంకీ రెడీ !

‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం వెంకీ రెడీ !

Published on Sep 22, 2025 2:00 PM IST

Venkatesh

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. రీసెంట్ గా త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాలో కూడా వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీ కోసం వెంకీ అక్టోబర్ 20 నుంచి సెట్‌లో అడుగుపెట్టనున్నారు. ముందుగా వెంకీ – చిరు కలయికలో కొన్ని సీన్స్ ను షూట్ చేయనున్నారు.

ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ వేస్తునట్లు తెలుస్తోంది. అన్నట్టు, ఈ సినిమాలో కామెడీ సీన్స్ గురించి మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో చాలా సన్నివేశాలకు కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు