ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!

ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!

Published on Sep 5, 2025 7:01 AM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీం అభిమానులకు ఓ స్టైలిష్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో పవర్‌స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌తో ఆయన రెండో కాంబినేషన్‌గా రాబోతోంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ శనివారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుందని.. పవన్ కళ్యాణ్‌పై చిత్రీకరించబోయే ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌తో ఈ షెడ్యూల్ మొదలవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సాంగ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్‌లతో రెడీ చేసిన ట్యూన్స్‌కు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నారు. సినిమా మొత్తాన్ని పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు