‘ఓజి’ కౌంట్‌డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్

‘ఓజి’ కౌంట్‌డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్

Published on Sep 1, 2025 8:00 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజి’ నుంచి పవన్ బర్త్ డే సందర్భంగా ఓ సాలిడ్ ట్రీట్ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి పవన్ బర్త్‌డే ట్రీట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ తరుణంలో ఈ సినిమా నుంచి రాబోయే పవన్ బర్త్ డే ట్రీట్‌కు మేకర్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 2న సాయంత్రం 4.05 గంటలకు ఓజస్ గంభీర తనదైన స్వాగ్‌తోట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడని మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

ఇక ఈ స్పెషల్ ట్రీట్‌తో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ అందించే థండరింగ్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు