విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్‌తో గూస్‌బంప్స్ ఖాయం..!

విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్‌తో గూస్‌బంప్స్ ఖాయం..!

Published on Aug 21, 2025 6:31 PM IST

మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘విశ్వంభర’ నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు వశిష్ట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా ఈ విశ్వంభర చిత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ అని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.

లోకాలలో ట్రావెల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకు ఆయువుపట్టుగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. వారు చెప్పనట్లుగానే ఈ గ్లింప్స్‌లో గ్రాఫిక్స్ వర్క్ మతిపోగుడుతోంది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

వారు ఈ విషయంలో ఎందుకు అలా ఉన్నారో ఈ గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతుంది. గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక ఈ గ్లింప్స్‌లో విశ్వంభరలో ఏం జరిగిందనే ప్రశ్నకు కొంతమేర క్లూ ఇచ్చారు. అయితే, అసలు విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ సినిమాలో యాక్షన్‌కు కూడా ఏమాత్రం కొదువ లేదని చిరు ఫైట్ సీన్ చూస్తే అర్థమవుతుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు