మొత్తానికి ‘వీరమల్లు’పై స్పందించిన క్రిష్.. ఏమంటున్నారంటే!

మొత్తానికి ‘వీరమల్లు’పై స్పందించిన క్రిష్.. ఏమంటున్నారంటే!

Published on Jul 22, 2025 10:10 AM IST

Pawan-kalayan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ చిత్రమే “హరిహర వీరమల్లు” తన నుంచి భారీ హిస్టారికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇంకొన్ని గంటల్లో భారీ ట్రీట్ రాబోతుంది. అయితే ఈ సినిమా ఎలా మొదలైంది ఎలా పూర్తయ్యింది అనేది అందరికీ తెలిసిందే.

ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పవన్ దగ్గరకి తీసుకెళ్లగా యువ దర్శకుడు జ్యోతికృష్ణ ముగించారు. అయితే క్రిష్ ఎప్పుడైతే బయటకి వచ్చారో అక్కడ నుంచి సైలెంట్ గానే ఉన్నారు. ఇతర పనులు చేసుకున్నారు. ఇప్పుడు రిలీజ్ దగ్గరకి వచ్చినప్పటికీ తన నుంచి మౌనమే ఉండేసరికి అసలు తాను స్పందిస్తారా లేదా అనేది మరింత ఆసక్తిగా మారింది.

అయితే ఫైనల్ గా క్రిష్ వీరమల్లు సినిమాపై స్పందించారు. ఇప్పుడు వీరమల్లు ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. కానీ నిశ్శబ్దంగా కాదు ఈ సినిమాకి ఇద్దరు లెజెండ్స్ ఫ్యాషనేటెడ్ జర్నీతో వస్తుంది అని ఏ ఎం రత్నం అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికీ నా సిన్సియర్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని.. ఈ చిత్రం చేయడం తన కెరీర్ లోనే ఒక ఉద్వేగభరితమైన యుద్ధాల్లో ఒకటని.

కేవలం దర్శకునిగా మాత్రమే కాకుండా మర్చిపోయిన చరిత్రని అన్వేషించే వ్యక్తిగా కొన్ని నమ్మలేని నిజాల్ని వెతకడంలో అన్నింటికీ మించి వినోదాన్ని మరియు జ్ఞానాన్ని ఒకేసారి అందించే సినిమాపై నమ్మకం ఉన్న వ్యక్తిగా అని తెలిపారు. దీనితో ఎట్టకేలకి వీరమల్లుపై క్రిష్ స్పందన ఒకింత సర్ప్రైజింగ్ గా బయటకొచ్చి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు